Thursday, September 29, 2011

పాఠశాల కు అదనపు తరగతి గది మంజూరు 26-9-2011

పాఠశాల ను D.E, రాజీవ్ విద్యా మిషన్, గుంటూరు వారు సందర్శించారు. పాఠశాల స్థితి గతులను అడిగి తెలుసుకొని అదనపు తరగతి గది మంజూరుకు మౌఖికం గా అంగీకరించారు. గత సంవత్సరం నిర్మించిన తరగతి గది పైన మరో గది నిర్మించు టకు ఏర్పాట్లు చేయవలసి ఉందని, త్వరలోనే మరో సారి సందర్శించి మార్కింగ్ చేస్తామని అయన అన్నారు. దీనితో పాఠశాల కు 5 తరగతులకు గాను, 5 గదులు సమకూరినట్లవుతుంది . ప్రస్తుతం 2,3 తరగతులు ఒకే గదిలో నడుప బడుతున్నాయి.27-09-11 నుండి 9-10-11 వరకు దసరా సెలవలు.

వార్షిక తనిఖీ (22-09-2011)

22-09-2011 న పాఠశాల వార్షిక తనిఖీ నిర్వహించబడినది. మండల విద్యాశాఖాధికారి శ్రీ రాజనాల కళ్యాణరావు గారు మరియు MRP లు శ్రీయుతులు M. మధుసూధన రావు, B. విజయ బాబు, T. శ్రీనివాస రావు పాఠశాలకు విచ్చేసి తనిఖీ నిర్వహించారు. పాఠశాల రికార్డులను, పాఠశాల లో అమలవుతున్న L.E.P., మధ్యాన్న భోజన పధకం, ఉచిత దుస్తుల పంపిణీ మొదలైన అంశాలను పరిశీలించి సంతృప్తి ని వ్యక్తం చేసి తగిన సూచనలు చేసారు. ఈ సందర్భం గా MEO గారు ప్రధానోపధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఆటలు 24-09-2011

పాఠశాల ఆవరణ పక్కనే ఉన్న ఖాళీ స్థలం లో సాయంత్రం విధ్యార్ధులతో ఆటలు ఆడిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. బ్రహ్మాజీ గారు. quarterly పరీక్షలు అయిపోవటం తో పిల్లలు హాయిగా ఆడుతూ గడిపారు. 27-09-11 నుండి 9-10-11 వరకు దసరా సెలవలు.


పల్లె ప్రేమ


తల్లిదండ్రులు తినిపిస్తే తినాల్సిన వయసులో ... తన చెల్లెలికి అప్యాయంగా గోరు ముద్దలు తినిపిస్తున్న విద్యార్ధిని పల్లె ప్రేమకు అద్దం పడుతుంది.

Wednesday, September 21, 2011

కందా నాగేశ్వర రావు గారు - పుస్తకాలు




అందరికి సుపరిచితులు శ్రీ కందా నాగేశ్వర రావు గారు పాఠశాలకు విచ్చేసి చిన్ని చిన్ని పుస్తకాలను పిల్లలకు (కొద్ది మొత్తానికి) పరిచయం చేసారు. బాలల గేయాలు, సులభంగా ఆంగ్లం నేర్చుకోవటానికి పుస్తకం, కథల పుస్తకాలు, పొడుపు కథల పుస్తకాలు లాంటి పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు అయన వద్ద ఉన్నాయి. తక్కువ మొత్తానికి (నాలుగు రూపాయలు) ఆయన పిల్లలకు అందజేస్తున్నారు. 20 నిమిషాల ఆయన కార్యక్రమం పిల్లలకు నచ్చింది. H.M. శ్రీ బ్రహ్మాజీ గారు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసారు.