Saturday, February 11, 2012

ప్రతిజ్ఞ - ఎస్తేరు రాణి ఒకటవ తరగతి

ఒకటవ తరగతి చదువుతున్నఎస్తేరు రాణి గలా గలా 'భారతదేశం నా మాతృ భూమి..' అంటూ ప్రతిజ్ఞ చేస్తోంది. hats off !!!

వేలిముద్రలతో బొమ్మలు - సదా టీచర్


రెండవ తరగతి బోధిస్తున్న విద్యా వాలంటీర్ శ్రీమతి న. సదా లక్ష్మి గారు, విద్యార్ధులకు వేలి ముద్రలతో, కూరగాయ ముక్కల ముద్రలతో బొమ్మలు వేయటం పిల్లలకు నేర్పించారు.

సిసింద్రి -సక్సెస్ స్టొరీ -2

cd స్కూల్ ఆవాస ప్రాంతమైన అంబేద్కర్ నగర్ లో ఉంటున్న తలారి సిసింద్రి సక్సెస్ స్టొరీ ఇది. cd పాఠశాల ఉపాధ్యాయులు 8-2-12 తల్లి దండ్రులను కలవటానికి ఆవాసప్రాంతం లోకి వెళ్లినపుడు, 7 తరగతి లో బడి మానివేసిన సిసింద్రి , తిరిగి హై స్కూల్ లో చేరటానికి సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. cd పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. బ్రహ్మాజీ గారు, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ . ఆంజనేయులు గారితో మాట్లాడి పిల్లవాడిని తిరిగి బడిబాట పట్టేల చేసారు.
సిసింద్రి తో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. బ్రహ్మాజీ గారు
డిసెంబర్ చివరి వారం లో తిరిగి బడిలో చేరిన సరిమెల్ల కుమార్, ఇప్పుడు చేరిన తలారి సిసింద్రి లతో cd పాఠశాల ఉపాధ్యాయులు .. అల్ ది బెస్ట్ పిల్లలూ..!