Thursday, December 29, 2011

మళ్ళీ బడికి (సక్సెస్ స్టొరీ)


బడికి రాని పిల్లల ఇళ్ళకు 27-12-11 న సందర్శన చేసి వారిని ప్రేరేపించిన ఫలితంగా సరిమెల్ల కుమార్ (తండ్రి: రఘురామయ్య) 7 వ తరగతిలో తిరిగి ప్రవేశించటానికి అంగీకరించటంతో, అతనిని మరుసటి రోజు (28-12-11) న ZP పాఠశాల లో, ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. ఆంజనేయులు గారి సహకారం తో చేర్పించట మైనది.

Wednesday, November 2, 2011

తల్లిదండ్రుల సమావేశము 2-11-2011

నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్సు లోని సూచనల ప్రకారం రోజు పాఠశాల లో తల్లి దండ్రుల సమావేశము నిర్వహించి SMC కి నూతన సభ్యులను ఎన్నుకోవటం జరిగింది. ప్రతి తరగతి నుండి ఆరుగురు సభ్యుల చొప్పున మొత్తం ౩౦ మందిని SMC సభ్యులుగా ఎన్నుకోవటం జరిగింది.





Thursday, September 29, 2011

పాఠశాల కు అదనపు తరగతి గది మంజూరు 26-9-2011

పాఠశాల ను D.E, రాజీవ్ విద్యా మిషన్, గుంటూరు వారు సందర్శించారు. పాఠశాల స్థితి గతులను అడిగి తెలుసుకొని అదనపు తరగతి గది మంజూరుకు మౌఖికం గా అంగీకరించారు. గత సంవత్సరం నిర్మించిన తరగతి గది పైన మరో గది నిర్మించు టకు ఏర్పాట్లు చేయవలసి ఉందని, త్వరలోనే మరో సారి సందర్శించి మార్కింగ్ చేస్తామని అయన అన్నారు. దీనితో పాఠశాల కు 5 తరగతులకు గాను, 5 గదులు సమకూరినట్లవుతుంది . ప్రస్తుతం 2,3 తరగతులు ఒకే గదిలో నడుప బడుతున్నాయి.27-09-11 నుండి 9-10-11 వరకు దసరా సెలవలు.

వార్షిక తనిఖీ (22-09-2011)

22-09-2011 న పాఠశాల వార్షిక తనిఖీ నిర్వహించబడినది. మండల విద్యాశాఖాధికారి శ్రీ రాజనాల కళ్యాణరావు గారు మరియు MRP లు శ్రీయుతులు M. మధుసూధన రావు, B. విజయ బాబు, T. శ్రీనివాస రావు పాఠశాలకు విచ్చేసి తనిఖీ నిర్వహించారు. పాఠశాల రికార్డులను, పాఠశాల లో అమలవుతున్న L.E.P., మధ్యాన్న భోజన పధకం, ఉచిత దుస్తుల పంపిణీ మొదలైన అంశాలను పరిశీలించి సంతృప్తి ని వ్యక్తం చేసి తగిన సూచనలు చేసారు. ఈ సందర్భం గా MEO గారు ప్రధానోపధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఆటలు 24-09-2011

పాఠశాల ఆవరణ పక్కనే ఉన్న ఖాళీ స్థలం లో సాయంత్రం విధ్యార్ధులతో ఆటలు ఆడిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. బ్రహ్మాజీ గారు. quarterly పరీక్షలు అయిపోవటం తో పిల్లలు హాయిగా ఆడుతూ గడిపారు. 27-09-11 నుండి 9-10-11 వరకు దసరా సెలవలు.


పల్లె ప్రేమ


తల్లిదండ్రులు తినిపిస్తే తినాల్సిన వయసులో ... తన చెల్లెలికి అప్యాయంగా గోరు ముద్దలు తినిపిస్తున్న విద్యార్ధిని పల్లె ప్రేమకు అద్దం పడుతుంది.

Wednesday, September 21, 2011

కందా నాగేశ్వర రావు గారు - పుస్తకాలు




అందరికి సుపరిచితులు శ్రీ కందా నాగేశ్వర రావు గారు పాఠశాలకు విచ్చేసి చిన్ని చిన్ని పుస్తకాలను పిల్లలకు (కొద్ది మొత్తానికి) పరిచయం చేసారు. బాలల గేయాలు, సులభంగా ఆంగ్లం నేర్చుకోవటానికి పుస్తకం, కథల పుస్తకాలు, పొడుపు కథల పుస్తకాలు లాంటి పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు అయన వద్ద ఉన్నాయి. తక్కువ మొత్తానికి (నాలుగు రూపాయలు) ఆయన పిల్లలకు అందజేస్తున్నారు. 20 నిమిషాల ఆయన కార్యక్రమం పిల్లలకు నచ్చింది. H.M. శ్రీ బ్రహ్మాజీ గారు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసారు.

Sunday, July 3, 2011

M.E.O. శ్రీ M.V. సుబ్బారావు గారి కి పదవీ విరమణ శుభాకాంక్షలు


గురుతుల్యులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, చందవరం L.E. పాఠశాల రిటైర్డ్ H.M. శ్రీ M.V. బసవయ్య గారికి శ్రీ సుబ్బారావు గారి చేతుల మీదుగా చిరు సన్మానం
మెడిసిన్ ఎంట్రన్సు స్టేట్ ఫస్ట్ రాంకర్ కుమారి హిమజ ను అభినందిస్తున్న M.L.C. శ్రీ లక్ష్మణరావు గారు, Z.P. వైస్ చైర్మన్ శ్రీ నల్లమోతు నట రాజేశ్వర రావు గారు . ( హిమజ శ్రీ బసవయ్య గారి పెద్దన్నయ్య గారి మనుమరాలు)

సన్మాన గ్రహీతలు శ్రీ M.V. సుబ్బారావు గారు, సతీమణి శ్రీమతి సీతామహాలక్ష్మి గారు.

ఇన్ చార్జ్ మండల విద్యా శాఖాధికారి గా అమీన్ సాహెబ్ పాలెం హై స్కూల్ H.M. శ్రీ పూర్ణచంద్ర రావు గారు బాధ్యతలు స్వీకరించారు.

Wednesday, June 22, 2011

విజయవంతంగా సాముహిక అక్షరాభ్యాసం 17-06-2011



సుస్వాగతం



కార్యక్రమానికి హాజరైన గ్రామస్తులు
పిల్లలను సిద్ధం చేస్తున్న H.M. గారు.

గ్రామ సర్పంచ్ శ్రీమతి దవులురి నరసమ్మ గారు (ఎడమ), పాఠశాల పూర్వప్రధానోపాధ్యాయిని శ్రీమతి T. వినోద గారు

ప్రసంగిస్తున్న H.M. గారు.

S. శ్రీనివాసరావు ఉపాధ్యాయుడు

శ్రీమతి N. పద్మ ఉపాధ్యాయిని


ప్రసంగిస్తున్న వినోద గారు
పిల్లలకు శుభాకాంక్షలు తెలుపుతున్న సర్పంచ్ గారు


అక్షరాభ్యాసం చేస్తున్న సర్పంచ్ గారు
అక్షరాభ్యాసం చేస్తున్న H.M. గారు.




MEO శ్రీ M. V. సుబ్బారావు గారు , మరియు MRP లు


అందరు చదవాలి ... అందరు ఎదగాలి