Sunday, August 15, 2010

స్వాతంత్ర్య దినోత్సవం 15-08-2010

64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...
పాఠశాల లో జరిగిన స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధి గా గ్రామప్రధమ పౌరురాలు శ్రీమతి దావులురి నరసమ్మ గరుగౌరవ అతిధి గా MPTC శ్రీమతి అన్న పూర్ణ గారు విచ్చేసారు. విశిష్ట అతిధి గా శ్రీ ఆరే చంద్ర శేఖర రావు (చందు) గారు సభను అలంకరించారు. సర్పంచ్ శ్రీమతి నరసమ్మ గారు పతాకావిష్కరణ గావించారు. ప్రధానోపాధ్యాయుడు ఎస్. శ్రీనివాసరావు మాట్లాడుతూ ASSIST స్వచ్చంద సంస్థ పాఠశాల మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు మంజూరు చేశిన విషయం వెల్లడించి డైరెక్టర్ జాస్ఠి రంగారావు గారికి ధన్యవాదాలు తెలిపారు. సదరు నిర్మాణమును పాఠశాల కు సిఫార్సు చేసినందుకు zp వైస్ చైర్మన్ శ్రీ నల్లమోతు నట రాజేశ్వర రావు గారికి కృతఙ్ఞతలు తెలియజేసారు.
అనంతరం ఉపాద్యాయులు శ్రీ మన్నె కుమార స్వామి గారు మాట్లాడుతూ దాతల విరాళాల వల్లనే పాఠశాల కు భౌతిక వనరులు సమకురాయన్నారు. నాదెండ్ల వాసి అయిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ అన్న ప్రగడ కామేశ్వర రావు గారి గురించి ఈ సందర్భంగా ఆయన పిల్లలకు తెలియజేసారు. ఉపాధ్యాయినులు గౌతమీ, సదాలక్ష్మి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేసారు.
విశిష్ట అతిధి శ్రీ చంద్రశేఖర్ గారు పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చక్కగా చదువు కొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పిల్లలకు డైరీ లు అందజేసారు. పాఠశాల లో జరుగుతున్నా L.E.P. కార్యక్రమం, మధ్యాన్న భోజన పధకం, గ్రంధాలయం, స్నేహ బాల కార్డులు మొదలైన వాటి గురించి తెలుసుకొని హర్షం వ్యక్తం చేసారు. ఉపాధ్యాయులు విద్యార్ధులకు మిఠాయిలు పంచి కార్యక్రమాన్ని ముగించారు.

Friday, August 6, 2010

అంగన్ వాడి instructor అంగన్ వాడి కేంద్ర సందర్సన - 05-08-2010

గుంటూరు జిల్లా చౌడవరం లోని శ్రీ వెంకటేశ్వర బాల కుటీర్ కు చెందిన శ్రీమతి నీలిమ, ట్రైనీ అంగన్వాడి కార్యకర్త లతో పాఠశాల అంగన్ వాడి కేంద్ర మును సందర్శించి వారికి శిక్షణ ఇచ్చారు.












ప్రాధమిక ఆరోగ్య కేంద్ర ANM లు పాఠశాల సందర్శన-30-07-2010

30-07-20౧౦ న ప్రాధమిక ఆరోగ్య కేంద్ర ANM లు బాల కోటేశ్వరి, బుల్లెమ్మాయిలు పాఠశాల సందర్శించారు . పరిశుభ్రత, మంచి ఆహార అలవాట్లు, పౌష్టికాహారం, దోమల నివారణ మొదలైన విషయాల గురించి పిల్లలకు పలు విషయాలు బోధించారు. పాఠశాల కు అవసరమైన సాధారణ మందులు అందజేసారు.