Friday, June 22, 2012

సాముహిక అక్షరాభ్యాసం 22-6-12

స్థానిక అంబేద్కర్ నగర్ లోని CD పాఠశాల లో విద్యా సంవత్సరం (2012-13) నూతనంగా చేరిన విద్యార్ధులకు సాముహిక అక్షరాభ్యాసం జరిగింది. కార్య క్రమానికి మండల విద్యాశాఖ అధికారి శ్రీ రాజనాల కళ్యాణ రావు గారు ముఖ్య అతిధి గా విచ్చేసారు.
చదువుకోవడం పిల్లల హక్కు - చదివించడం పెద్దల బాధ్యత

అతిధులను వేదిక మీదకు ఆహ్వానించి విద్యార్ధులకు సందేశమిస్తున్న పాఠశాల HM శ్రీ జి. బ్రహ్మాజీ గారు

పిల్లలకు, తల్లిదండ్రులకు సందేశమిస్తున్న MEO గారు

సాముహిక అక్షరాభ్యాసం - ఓం నమః శివాయః సిథం నమః
పిల్లలతో వారి మాతృమూర్తులు
HW పాఠశాల లో అక్షరాభ్యాసం
కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేఖరులకు, CCnews వారికీ ధన్యవాదములు


ccన్యూస్

కర్టెసీ: సాక్షి దిన పత్రిక

Saturday, February 11, 2012

ప్రతిజ్ఞ - ఎస్తేరు రాణి ఒకటవ తరగతి

ఒకటవ తరగతి చదువుతున్నఎస్తేరు రాణి గలా గలా 'భారతదేశం నా మాతృ భూమి..' అంటూ ప్రతిజ్ఞ చేస్తోంది. hats off !!!

వేలిముద్రలతో బొమ్మలు - సదా టీచర్


రెండవ తరగతి బోధిస్తున్న విద్యా వాలంటీర్ శ్రీమతి న. సదా లక్ష్మి గారు, విద్యార్ధులకు వేలి ముద్రలతో, కూరగాయ ముక్కల ముద్రలతో బొమ్మలు వేయటం పిల్లలకు నేర్పించారు.

సిసింద్రి -సక్సెస్ స్టొరీ -2

cd స్కూల్ ఆవాస ప్రాంతమైన అంబేద్కర్ నగర్ లో ఉంటున్న తలారి సిసింద్రి సక్సెస్ స్టొరీ ఇది. cd పాఠశాల ఉపాధ్యాయులు 8-2-12 తల్లి దండ్రులను కలవటానికి ఆవాసప్రాంతం లోకి వెళ్లినపుడు, 7 తరగతి లో బడి మానివేసిన సిసింద్రి , తిరిగి హై స్కూల్ లో చేరటానికి సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. cd పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. బ్రహ్మాజీ గారు, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ . ఆంజనేయులు గారితో మాట్లాడి పిల్లవాడిని తిరిగి బడిబాట పట్టేల చేసారు.
సిసింద్రి తో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. బ్రహ్మాజీ గారు
డిసెంబర్ చివరి వారం లో తిరిగి బడిలో చేరిన సరిమెల్ల కుమార్, ఇప్పుడు చేరిన తలారి సిసింద్రి లతో cd పాఠశాల ఉపాధ్యాయులు .. అల్ ది బెస్ట్ పిల్లలూ..!