Friday, January 25, 2013
నాదెండ్ల - CD పాఠశాల కు బ్యాంకు అఫ్ బరోడా, నాదెండ్ల శాఖ సిబ్బంది నోటు బుక్స్ పంపిణి
నాదెండ్ల - CD పాఠశాల కు బ్యాంకు అఫ్ బరోడా, నాదెండ్ల శాఖ వారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నోటు బుక్స్ పంపిణి చేసారు.
24-1-13 గురువారం CD పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి పాఠశాలా HM శ్రీ G .బ్రహ్మాజీ గారు అధ్యక్షత వహించారు .కార్యక్రమం లో బ్యాంకు సిబ్బంది, ఐద్వా ప్రాంతీయ శాఖ అధ్యక్షురాలు అమరమ్మ గారు, జగన్నాధమ్మ గారు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
బ్యాంకు మేనేజర్ గారు, బ్యాంకు అఫ్ బరోడా
బ్యాంకు మేనేజర్ గారు విద్యార్ధులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి పిల్లలలో విలువలు పెంచుటకు ఉపాధ్యాయులు కృషి చేయాలనీ కోరారు.
పాఠశాల విద్యార్ధులు
ఐద్వా ప్రాంతీయ శాఖ అధ్యక్షురాలు , అమరమ్మ గారు
అమరమ్మ గారు మాట్లాడుతూ ఆవాస ప్రాంతం లో బడికి రాని పిల్లలను తిరిగి బడిలో చేర్చుకొనుటకు అందరు కలిసి కృషి చేయాలని ఆకాంక్షించారు.
CRP సింగయ్య గారు

HM శ్రీ బ్రహ్మాజీ గారు , CD పాఠశాల నాదెండ్ల
HM శ్రీ బ్రహ్మాజీ గారు మాట్లాడుతూ విద్యార్ధులలో విలువలు పెంచుటకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు బ్యాంకు సిబ్బంది కి , అమరమ్మ గారికి పాఠశాల తరుపును ధన్యవాదాలు తెలియజేసారు. కార్యక్రమాన్ని కవర్ చేసిన ప్రెస్ వారికీ, cctv వారికీ ధన్య వాదాలు తెలియజేసారు.
బ్యాంకు సిబ్బంది
నాదెండ్ల - దాతల సహకారంతో CD పాఠశాలకు అందిన 32 అంగుళాల LCD TV
CD పాఠశాల లో గతం లో పని చేసి ప్రస్తుతం జిల్లా ఖజానా కార్యాలయం లో సీనియర్ అకౌంటెంట్ (గ్రూప్ 2) గా పని చేయుచున్న శ్రీ మన్నే కుమార స్వామి గారు,మరియు , షేక్ హుస్సేన్ షరీఫ్ (సాఫ్ట్ వేర్ ), షేక్ బషీర్ (సాఫ్ట్ వేర్ )మరి కొంత మంది దాతల సహాయం తో పాఠశాల కు 32 అంగుళాల LCD TV కొనటం జరిగినది. దీని వలన విద్యార్ధులకు అర్ధవంతంగా బోధించుటకు వీలవుతుంది. డీవీడీ ప్లేయర్, పెన్ డ్రైవ్ , కంప్యూటర్ కనెక్ట్ చేసుకొనే వీలుఉండటం తో డిజిటల్ సమాచారం నేరుగా విద్యార్ధులకు చూపించుటకు , వినిపించుటకు వీలవుతుంది. గవర్నమెంట్చానల్స్ చూపించుటకు ROT ని ఏర్పాటు చేసుకుంటే మరిన్ని లెసన్స్ దృశ్య,శ్రవణ మాధ్యమంలో విద్యార్ధుల ముందుకు రాగలవు. ఈ సందర్భం గా పాఠశాల ఉపాధ్యాయ బృందం దాతలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది.
Subscribe to:
Posts (Atom)