
Saturday, September 4, 2010
Sunday, August 15, 2010
స్వాతంత్ర్య దినోత్సవం 15-08-2010
64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...
పాఠశాల లో జరిగిన స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధి గా గ్రామప్రధమ పౌరురాలు శ్రీమతి దావులురి నరసమ్మ గరుగౌరవ అతిధి గా MPTC శ్రీమతి అన్న పూర్ణ గారు విచ్చేసారు. విశిష్ట అతిధి గా శ్రీ ఆరే చంద్ర శేఖర రావు (చందు) గారు సభను అలంకరించారు. సర్పంచ్ శ్రీమతి నరసమ్మ గారు పతాకావిష్కరణ గావించారు. ప్రధానోపాధ్యాయుడు ఎస్. శ్రీనివాసరావు మాట్లాడుతూ ASSIST స్వచ్చంద సంస్థ పాఠశాల మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు మంజూరు చేశిన విషయం వెల్లడించి డైరెక్టర్ జాస్ఠి రంగారావు గారికి ధన్యవాదాలు తెలిపారు. సదరు నిర్మాణమును పాఠశాల కు సిఫార్సు చేసినందుకు zp వైస్ చైర్మన్ శ్రీ నల్లమోతు నట రాజేశ్వర రావు గారికి కృతఙ్ఞతలు తెలియజేసారు.
అనంతరం ఉపాద్యాయులు శ్రీ మన్నె కుమార స్వామి గారు మాట్లాడుతూ దాతల విరాళాల వల్లనే పాఠశాల కు భౌతిక వనరులు సమకురాయన్నారు. నాదెండ్ల వాసి అయిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ అన్న ప్రగడ కామేశ్వర రావు గారి గురించి ఈ సందర్భంగా ఆయన పిల్లలకు తెలియజేసారు. ఉపాధ్యాయినులు గౌతమీ, సదాలక్ష్మి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేసారు.
విశిష్ట అతిధి శ్రీ చంద్రశేఖర్ గారు పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చక్కగా చదువు కొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పిల్లలకు డైరీ లు అందజేసారు. పాఠశాల లో జరుగుతున్నా L.E.P. కార్యక్రమం, మధ్యాన్న భోజన పధకం, గ్రంధాలయం, స్నేహ బాల కార్డులు మొదలైన వాటి గురించి తెలుసుకొని హర్షం వ్యక్తం చేసారు. ఉపాధ్యాయులు విద్యార్ధులకు మిఠాయిలు పంచి కార్యక్రమాన్ని ముగించారు.
Friday, August 6, 2010
అంగన్ వాడి instructor అంగన్ వాడి కేంద్ర సందర్సన - 05-08-2010
ప్రాధమిక ఆరోగ్య కేంద్ర ANM లు పాఠశాల సందర్శన-30-07-2010
Saturday, June 26, 2010
Thursday, June 17, 2010
నూతన విద్యాసంవత్సరం ప్రారంభం 2010-11 బడి బాట
2010-11 విద్యా సంవత్సరం జూన్ 14 న ప్రారంభమైంది. ఉపాధ్యాయులందరూ జనగణన ముగించి విధులకు హాజరైనారు. విద్యార్ధులతో పాఠశాలలో సందడి మొదలైంది.
బడిబాట కార్యక్రమం జూన్ 14 నుండి 27 వరకు ఉంటుంది.
జూన్ 16 న బడి ఆవాస ప్రాంతం లో పిల్లలతో ర్యాలి నిర్వహించబడినది. ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను బడిలో చేర్పించటం బడిబాట ఉద్దేశ్యం.
17 ఐదవ తరగతి నుండి ప్రమోట్ అయిన విద్యార్ధులకు రికార్డు షీట్స్ ఇవ్వటం జరిగింది.
21 జూన్ న సాముహిక అక్షరాభ్యాసం జరుగుతుంది.
బడిబాట కార్యక్రమం జూన్ 14 నుండి 27 వరకు ఉంటుంది.
జూన్ 16 న బడి ఆవాస ప్రాంతం లో పిల్లలతో ర్యాలి నిర్వహించబడినది. ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను బడిలో చేర్పించటం బడిబాట ఉద్దేశ్యం.
17 ఐదవ తరగతి నుండి ప్రమోట్ అయిన విద్యార్ధులకు రికార్డు షీట్స్ ఇవ్వటం జరిగింది.
21 జూన్ న సాముహిక అక్షరాభ్యాసం జరుగుతుంది.
Wednesday, April 21, 2010
పాఠశాల వార్షికోత్సవము
ది. ఇరవై మూడు ఏప్రిల్, రెండువేలపది న జరిగిన పాఠశాల వార్షికోత్సవము స్వాగతం సుస్వాగతం!!
టాలెంట్ టెస్ట్ నందు బహుమతులు పొందిన విద్యార్ధులు
ఏప్రిల్ ఎనిమిది, రెండువేల పది న ఐదవ తరగతి విద్యార్ధులకు జరిగిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్ నందు కాంప్లెక్స్ స్థాయిలో బహుమతులు పొందిన విద్యార్ధులకు మరియు పదవ తేదిన కాంప్లెక్స్ స్థాయిలో నాలుగవ తరగతి విద్యార్ధులకు జరిగిన టాలెంట్ టెస్ట్ నందు బహుమతులు పొందిన విద్యార్ధులకు బహుమతులు ప్రధానం చేయుటకు సమావేశం హెచ్. యి. స్కూల్ నందు ఏర్పాటు చేయటమైనది. సమావేశము నకు యం.యి.వో. శ్రీ యం.వి. సుబ్బా రావు గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు.


నాగ ఫణీంద్ర ఐదవ తరగతి
ఇస్సాకు ఐదవ తరగతి
పృథ్వి ఐదవ తరగతి

సి.డి. స్కూల్ విద్యార్ధులు
హెచ్.డబ్ల్యు స్కూల్ విద్యార్ధులు
హెచ్.యి. స్కూల్ విద్యార్ధులు.
Tuesday, April 20, 2010
బ్లాక్ బోర్డ్ లకు మరమ్మత్తులు
Subscribe to:
Posts (Atom)